విలేజ్ లో వినాయకుడి విహారం
'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు హీరోగా, శరణ్య కథానాయికగా మూన్ వాటర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతా 'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు హీరోగా, శరణ్య కథానాయికగా మూన్ వాటర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న 'విలేజ్ లో వినాయకుడు' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 'వినాయకుడు' చిత్రానికి దర్శకత్వం వహించిన సాయికిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి నేపథ్యంలోసాగే ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియోను, అక్టోబర్లో సినిమాను విడుదల చేస్తామని ఈ చిత్ర దర్శకుడు తెలిపారు. కుటుంబంలో ఫాట్ గా ఉండే ఓ యువకుడి ఇతివృత్తం లో హీరో పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. యండమూరి వీరేంద్రనాథ్ ఓ పాత్రలో ఈ సినిమాలో నటించారు. జోగినాయుడు, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణికాంత్ సంగీతాన్ని సమకూర్చగా, ఫొటోగ్రఫీ రమణసాల్వ , సాహిత్యం వనమాలి అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|