నారా రోహిత్ 'బాణం' ఆడియో
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూరి నాయుడు తనయుడైన రోహిత్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'బాణం'. త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ పతాకంపై ప్రియాంకదత్ చలసాని నిర్మాతగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 'బాణం' ఆడియో ఆవిష్కరణోత్సవాన్ని అయిదు న్యూస్ ఛానెల్స్ లో వినూత్నంగా జరిపారు. ఈ ఛానెల్స్ లో ఐదుగురు ప్రముఖులు ఆడియో సీడీలను రిలీజ్ చేసి ఒక్కోపాటను ఆవిష్కరించారు. సోని మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, డాక్టర్ దాసరి నారాయణరావు, బాలకృష్ణ, ఎన్టీఆర్, అల్లు అరవింద్ ఆడియో సీడీలను రిలీజ్ చేయగా, కె.రాఘువేంద్రరావు, హిందూ ప్రాజెక్ట్స్ శ్యాంప్రసాద్ రె్డడి, మెహర్ రమేష్, పారిశ్రామిక వేత్తలు రఘురాజ్, డాక్టర్ వాసు అందుకున్నారు. అశ్వనీదత్ తరహాలోనే ఆయన కుమార్తెలు చిత్ర నిర్మాణరంగంలో అద్భుతమైన విజయాలు సాధించాలని, 'బాణం' ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని అతిథులంతా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అశ్వనీదత్, శేషు ప్రియాంక చలసాని, చైతన్య దంతులూరి పాల్గొన్నారు. నారా రోహిత్, వేదిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ రెడ్డి, సాయాజీ షిండే, భానుచందర్, ఏవియస్ తదితరులు నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|