ఉదయ్ కిరణ్ సినిమా షురూ
ఉదయ్ కిరణ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ సంయుక్తంగా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సుభాసెల్వం దర్శకుడు. ఈ చిత్రం హైద్రాబాద్ లో మొదలైంది. హీరోహీరోయిన్ల జంటపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా, ప్రసన్నకుమార్ స్విచ్చాన్ చేశారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
హీరో ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, కలకాలం నిలిచిపోయే చక్కటి ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు. మంచి సృజన్మాతకత ఉన్న దర్శకుడు సభాసెల్వం అనీ, మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు ఈ చిత్రం చేస్తున్నారనీ అన్నారు. తాను, శ్వేత ప్రేమికులుగా నటిస్తున్నామనీ, తన కెరీర్ ను ఈ చిత్రం మంచి మలుపు తిప్పుతుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. మనసును హత్తుకునే సినిమా ఇదనీ, ఇందులో నటిస్తుండటం సంతోషంగా ఉందనీ శ్వేత బసు ప్రసాద్ పేర్కొంది. కథను నమ్ముకుని చేస్తున్న చిత్రమిదని సుభాసెల్వం తెలిపారు. ప్రేమలోని కొత్తకోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. సరదాగా సాగిపోయే సున్నితమైన ప్రేమకథా చిత్రమిదని, ప్రదీప్ కోనేరు చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారనీ చిత్ర సమర్పకుడు యు.కె. ఎవెన్యూ ఉదయ్ కిరణ్ తెలిపారు. ఈనెలాఖరు వరకూ తొలి షెడ్యూల్ జరిపి, వచ్చే నెలలో మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు చెప్పారు. దీంతో షూటింగ్ పూర్తవుతుందనీ, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ ఉంటుందనీ చెప్పారు. చిత్రం శ్రీను, గుండు హనుమంతరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రాఘువ్ ఎన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|