దసరా 'కుర్రాడు' వరుణ్
'హ్యాపీడేస్', 'కొత్తబంగారులోకం', 'ఎవరైనా ఎపుడైనా' చిత్రాల తర్వాత వరుణ్ సందేష్ కథానాయకుడుగా ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'కుర్రాడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. పి.కిరణ్ నిర్మాతగా గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గుణ్ణం తొలిసారిగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళ చిత్రం 'పొల్లాదవన్'కు ఇది రీమేక్.
వరుణ్ సందేష్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం రూపొందుతోందనీ, వరుణ్ కు జోడిగా నేహాశర్మ ('చిరుత' ఫేమ్) నటించిందనీ నిర్మాత కిరమ్ తెలిపారు. నేహా గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. కొందరు కుర్రాళ్లకు జీవితమే ఓ సాహసమనీ, ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే కథానాయకుడి ఇతివృత్తమే ఈ చిత్రమనీ తెలిపారు. షూటింగ్ పూర్తయిందనీ, నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జురుగుతన్నాయనీ చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియో, దసరాకి సినిమా విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో 'బొమ్మాళి' రవి, తనికెళ్ల భరణి, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, వేణు, నవీన్ శ్రీ తదితరులు నటించారు. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, అచ్చు సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|