తెలుగులో సూర్య 'ఆదవన్'
'గజనీ, 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి అనువాద చిత్రాల తర్వాత హీరో సూర్య తమిళంలో నటిస్తున్న భారీ చిత్రం 'ఆదవన్'. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సూర్యకు జోడిగా అందాలనటి నయనతార నటిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీ ఎస్.ఆర్.క్రియేషన్స్ అధినేత చందన రమేష్ దక్కించుకున్నారు. జి.కుమార్ బాబు సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు.
'గజనీ' ఫేమ్ సూర్యతో కలకత్తా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని చందన రమేష్ తెలిపారు. 'ముత్తు', 'పంచతంత్రం', 'నరసింహా', 'స్నేహం కోసం', 'దశావతారం' వంటి పలు సెన్సేషన్ హిట్లు అందించిన కె.ఎస్.కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోందని తెలిపారు. అక్టోబర్ 17న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతుందని చెప్పారు. తెలుగు వెర్షన్ కు ఇంకా టైటిల్ నిర్ణయించలేదని చెప్పారు. ప్రముఖ కమెడియన్ వడివేలు, మురళి, ఆనంద్ బాబు, ఫెఫ్సి విజయన్, రమేష్ ఖన్నా, సాయాజీ షిండే, రాహుల్ దేవ్, మనో బాల తదితరులు నటిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|