'రెచ్చిపో'యే పాటలు 5న
నితిన్, ఇలియానా జంటగా శ్రీ స్పెక్ట్రా మీడియా పతాకంపై జి.వి.రమణ నిర్మిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'రెచ్చిపో'. పరుచూరి మురళి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సెప్టెంబర్ 5న సుప్రీం మ్యూజిక్స్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
భుజబలంతో పాటు బుద్ధిబలం కూడా మెండుగా ఉన్న కథానాయకుడు జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయనీ, వాటిని ఎదుర్కొనే క్రమంలో హీరో ఎలా రెచ్చిపోయాడన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందనీ జి.వి.రమణ తెలిపారు, వైవిధ్యమైన కథ, విభిన్న కథాంశంతో నితిన్ ఇమేజ్, బాడీలాంగ్వేజ్ కు సరిపోయే విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. నితిన్ ఇంతవరకూ తన కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయలేదనీ, అతనికి మంచి పేరు వస్తుందనీ అన్నారు. ఇలియానా అభినయంతో కూడిన గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. మణిశర్మ సంగీతం యూత్ ఫుల్ గా ఉంటూ అందర్నీ ఆలరిస్తుందన్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. కొత్త తరహా కథ, కథనాలతో బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందినట్టు పరుచూరి మురళి తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, ఆహుతి ప్రసాద్, భానుచందర్, సునీల్, వేణుమాధవ్, రఘుబాబు, సుమన్ శెట్టి, రమాప్రభ, హేమ తదితరులు నటించారు. రమేష్-గోపి మాటలు, సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|