కోర్టు సన్నివేశాల్లో 'నీలవేణి'
ఆర్తి అగర్వాల్, ముఖుల్ దేవ్, పోసాని కృష్ణమురళి, ఆదిత్య ఓం ప్రధాన పాత్రల్లో ఎం.జి.ఆర్.కంబైన్స్ పతాకంపై పి.గిరీష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'నీలవేణి'. భరత్ పారేపల్లి దర్శకుడు. నిర్విరామంగా జరుపుకొంటున్న ఈ చిత్రం ఒక ఫైట్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు భరత్ పారేపల్లి తెలిపారు.
ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్, కోర్టు సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో పదిరోజుల పాటు చిత్రీకరించినట్టు ఆయన చెప్పారు. ఆర్తి అగర్వాల్ నటనకు ఆస్కారమున్న పవర్ ఫుల్ పాత్ర పోషిస్తోందనీ, నీలవేణి పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తోందనీ తెలిపారు. యాక్షన్ సన్నివేశాలను రామ్-లక్ష్మణ్ చాలా డిఫరెంట్ గా కంపోజ్ చేశారనీ, రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు సంభాషణలు మరో హైలైట్ అవుతుందనీ అన్నారు. నటీనటుల సహకారంతో పాటు ఈ చిత్రాన్ని ఎలాగైనా పెద్ద హిట్ చేయాలనే పట్టుదలతో యూనిట్ అంతా కష్టపడి పనిచేస్తోంద్నారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఖర్చు చేస్తున్నారనీ, సెప్టెంబర్ 10న ఆడియో విడుదల చేసి, దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని పాత్రల్లో ఎం.ఎస్.నారాయణ, గీతా సింగ్, శివపార్వతి, సుప్రీత్, రవికాలే, విజయ్ రంగరాజు, సత్తెన్న, గీతాంజలి తదితరులు నటిస్తున్నారు. రామకృష్ణ-భారతీబాబు-పెద్దాడ మూర్తి పాటలు, ఆళ్ల రాంబాబు సినిమాటోగ్రఫీ, లలిత్ సురేష్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|