గోపీచంద్ తో పూరీ కొత్త చిత్రం
వైష్ణో అకాడమీ పతాకంపై 'ఇడియట్', 'అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' వంటి బ్లాక్ బస్టర్స్ ను అందించిన సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా గోపీచంద్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్రకటించారు. వైష్ణో అకాడమీ బ్యానర్ పై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడుగా 'ఏక్ నిరంజన్' చిత్రానికి పూరీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ హీరోగా నటించనున్న చిత్రం ఉంటుంది.
గోపీచంద్ హీరోగా రూపొందనున్న చిత్రం షూటింగ్ నవంబర్ లో ప్రారంభించి 2010 ఏప్రిల్ 28న సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామనీ పూరీ జగన్నాథ్ తెలిపారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వ బాధ్యతలను పూరీ చేపట్టనున్నారు. తక్కిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఇక నుంచి తన దర్శకత్వంలో వచ్చే చిత్రాలన్నీ వైష్ణో అకాడమీ బ్యానర్ లోనే ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'శంఖం' చిత్రం సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.
Be first to comment on this News / Article!
|