ఆర్తి లిప్-లాక్ ఎఫైర్!
'నువ్వు నాకు నచ్చావ్'తో పరిశ్రమలోకి అడుగుపెట్టి చిరంజీవి 'ఇంద్ర', ఎన్టీఆర్ 'అల్లరి రాముడు' వరకూ పలువురు స్టార్ హీరోలతో నటించి నెంబర్ వన్ రేసులో పోటీపడిన ఆర్తి అగర్వాల్ ఇప్పుడు పెళ్లి తర్వాత మళ్లీ టాలీవుడ్ తిరిగొచ్చి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. నిన్నటి తాజా మెరుపులు మాయమై బొద్దుగా తయారవడం వల్లనో, అవకాశాలు రావనే బొంగ వల్లనో తెలియదు కానీ ఇప్పుడు ఆర్తి ఒప్పుకుంటున్న ప్రాజెక్ట్ లు ఆమె ఒకప్పటి అభిమానులను కూడా దూరం చేసే అవకాశాలు లేకపోదని బలంగా వినిపిస్తోంది. నిజానికి ఆర్తితో నటించిన ఒకప్పటి హీరోలు ఇప్పుడు కూడా లైమ్ లైట్ లో ఉన్నప్పటికీ ఆమెకు ఎవర్నించీ పిలుపు రాలేదట. దీంతో చేతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తాపత్రయం ఆర్తిలో బలంగా కనిపిస్తోంది. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న దర్శకుడు భరత్ పారేపల్లి ఇప్పుడు ఆర్తి హీరోయిన్ గా 'నీలవేణి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్తి కెరీర్ లోనే ఈ పాత్ర మైల్ స్టోన్ అవుతుందని ఆయన బలంగా చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి విలనీ పాత్రల్లో నటిస్తున్న ముకుల్ దేవ్ ను ఎకాఎకిన ఈ చిత్రంలో హీరోని చేసి ఆర్తి పక్కన నటింపజేశారు. హీరో ఎవరైతే నాకేంటి అనే తరహాలో ఆర్తి సెకెండ్ ఇన్నింగ్స్ సాగుతోందనడానికి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు.
ఈ చిత్రం కోసం ఆర్తి-ముకుల్ దేవ్ మధ్య కొన్ని హాట్ సన్నివేశాలను చిత్రీకరించారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తాజాగా మీడియాకు విడుదల చేసిన ఫోటోల్లో ఆర్తి-ముకుల్ ఒకరి పెదాలపై మరొకరు ఘాటుగా ముద్దుపెట్టుకునే ఫోటో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అలాగే ఆర్తికి పాలాభిషేకం చేసే ఘట్టాన్ని కూడా దర్శకుడు కావాల్సినంత గ్లామర్ జోడించి ఈమధ్యనే తీశారు. ఆర్తికి ఇంతవరకూ ఉన్న ఫ్యామిలీ గాళ్ ఇమేజ్ తాజా లిప్ లాక్ ఘట్టాలతో తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. దీనికితోడు స్త్రీలను చవకబారు పదజాలంతో, చిత్రీకరణలతో తమాషా చేసే పోసాని కృష్ణమురళి సరసన కూడా ఆర్తి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని 'మెంటల్ కృష్ణ'తో దిమ్మదిరిగిపోయిన సత్యాకృష్ణన్ కు ఎదురైన చేదు అనుభవమే ఆర్తి కూడా చవిచూస్తుందా అనేది ఆ సినిమా విడుదల తర్వాతే తెలియాలి. ఏదిఏమైనా ఆర్తి 'బ్లయిండ్ గేమ్' ఆడుతోందనే అభిప్రాయానికి ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ తావిస్తోంది.
Be first to comment on this News / Article!
|