ఎన్టీఆర్ తో మహేష్ ఢీ!
'కంత్రి' తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుర్స్' చిత్రం భారీ అంచనాలతో నిర్మాణం జరుపుకొంటోంది. ఆ అంచనాలకు తగ్గట్టు భారీ స్టార్ కాస్ట్ తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఆది', 'శాంబ' చిత్రాల తర్వాత ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ కు జోడిగా నయనతార, మరో హీరోయిన్ గా షీలా నటిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ప్రతినాయకుడి పాత్రకు సంబంధించి సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ప్రతినాయకుడు ఎంత పవర్ ఫుల్ గా ఉంటే నాయకుడి పాత్ర అంతకంటే ఎక్కువగా రక్తి కడుతుందంటారు. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ ను ఢీకొనే ప్రతినాయకుడి పాత్రల్లో బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు.
మహేష్ మంజ్రేకర్ గతంలో గోపీచంద్ 'ఒక్కడున్నాడు', జగపతిబాబు 'హోమం' చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించారు. కొద్ది గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ 'అదుర్స్'లో నటిస్తున్నారు. నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకొన్న 'బృందావనం' (గోవిందుడు అందరి వాడేలే) చిత్రం షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Be first to comment on this News / Article!
|