సాయిరాం 'బంపర్ ఆఫర్'
పూరీ జగన్నాథ్ తన సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా వైష్ణో అకాడమీ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రానికి 'బంపర్ ఆఫర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా పూరీ జగన్నాథ్ శిష్యుడు జయరవీంద్ర దర్శకుడిగా, ప్రముఖ గాయకుడు రఘు కుంచె సంగీత దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్ తెలిపారు.
రొమాంటిక్ మాస్ ఎంటర్ టైనర్ గా ఆడియెన్స్ ను హండ్రెడ్ పర్సంట్ అలరించే చిత్రంగా ఇది రూపొందుతోందనీ, హీరో సాయిరామ్ న్యూలుక్ తో కనిపిస్తారనీ, ఆయనకు జోడిగా బిందు మాధవి ('ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్) నటిస్తోందనీ ఆయన చెప్పారు. బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు
ఈనెల 26 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకూ బ్యాంకాక్ లో చిత్రీకరిస్తామనీ, దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనీ తెలిపారు. సెప్టెంబర్ 5న పూరీ జగన్నాథ్ ఆడియో సంస్థ 'పూరీ సంగీత్' ద్వారా పాటలు రిలీజ్ చేస్తామనీ, సెప్టెంబర్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎం.ఎస్.నారాయణ, ఆలీ, కోవై సరళ, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, రక్ష తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు సైతం పూరీ జన్నాథ్ అందిస్తున్న ఈ చిత్రానికి భాస్కరభట్ల పాటలు, సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ, చిన్నా ఆర్ట్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|