వామ్మో? శంభో శివ శంభో?!
తమిళంలో 3 కోట్లతో తీసి దానికి ఓ పది రెట్లు (30 కోట్లకు పైమాటే) లాభాలను సంపాదించి పెట్టిన 'నాడోడిగల్' చిత్రం ఇప్పుడు తెలుగులో రవితేజ కథానాయకుడుగా 'శంభో శివ శంభో' పేరుతో తెరకెక్కుతోంది. తమిళంలో బడ్జెట్ పరంగా చిన్న సినిమా కోవలో రూపొందిన చిత్రం ఇప్పుడు తెలుగులోకి వచ్చేసరికి భారీ బడ్జెట్ చిత్రంగా మారినట్టు సమాచారం. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ పద్మావతి సమర్పణలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్ డైరెక్టర్ సముదిరకని తొలిసారిగా ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు కూడా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి బడ్జెట్ అంచనా వ్యయం 16 కోట్ల కు పై మాటేనని తెలుస్తోంది.
స్నేహం విలువను చాటి చెప్పే ఈ చిత్రంలో రవితేజతో పాటు అల్లరి నరేష్, శివబాలాజీ, సునీల్, ప్రియమణి వంటి క్రేజీ తారాగణం నటిస్తుండటంతో వీరికి భారీ పారితోషికం చెల్లించారనీ, దీంతో బడ్జెట్ 16 కోట్లు దాటిందనీ చెబుతున్నారు. సముదిరకని సైతం కోటి రూపాయల పారితోషికాన్ని అందుకున్నారట. ఆగస్టు 16న ప్రారంభమైన ఈ చిత్రం కర్నూలు, రాజమండ్రి, హైద్రాబాద్ లలో జరిగే సింగిల్ షెడ్యూల్స్ తో పూర్తవుతుంది. అన్నట్టు ఈ చిత్రంతో నటి రోజా రీఎంట్రీ ఇవ్వనుంది.
Be first to comment on this News / Article!
|