మురుగన్ ను మెచ్చిన గజనీ
నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ హాస్యాన్ని ఆస్వాదించని తెలుగింటి గడప ఉండదు. నిరంతరం రాజకీయాల్లో మునిగితేలే నా వంటి వారికి రాజేంద్రప్రసాద్ సినిమాలు ఎంతో సేదతీరుస్తాయని దివంగత మాజీ ప్రధాన పి.వి.నరసింహారావు అంతటి వారే ఆయనను మెచ్చుకున్నారు. విలక్షణ పాత్రల పోషణలో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న బాలీవుడ్ స్టార్ హీరో, 'గజనీ' ఫేమ్ అమీర్ ఖాన్ సైతం ఇప్పుడు రాజేంద్రప్రసాద్ నటనను ప్రశంసలతో ముంచెత్తారు. రాజేంద్రప్రసాద్ టైటిల్ పాత్ర పోషిస్తూ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న 'క్విక్ గన్ మురుగన్' చిత్రాన్ని అమీర్ ఈమధ్యనే చూశారు. ఆ సినిమా అమీర్ కు అమితంగా నచ్చేసింది.
'క్విక్ గన్ మురుగన్ చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. రాజేంద్రప్రసాద్ నటన నన్నెంతో ఆకట్టుకుంది. కడుపుబ్బ నవ్వించే సందర్భాలు సినిమాలో చాలా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నచ్చే పాత్రను రాజేంద్రప్రసాద్ పోషించారు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించిన చిత్ర యూనిట్ ను అభినందించకుండా ఉండలేం. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని మీరు కూడా తప్పనిసరిగా చూడండి. మరిచిపోవద్దు' అంటూ అమీర్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. అమీర్ కంటే రాజేంద్రప్రసాద్ సీనియర్ అయినప్పటికీ అమీర్ మెప్పు పొందడటమే అది గొప్ప విషయమే కదా. శశాంక్ ఘోష్ దర్శకత్వలో ఫ్యాట్ ఫిష్ ఫిలిమ్ సంస్థ నిర్మించిన 'క్విక్ గన్ మురుగన్' చిత్రాన్ని ఫాక్స్ స్టార్ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తోంది.
Be first to comment on this News / Article!
|