'ఈనాడు' నిరీక్షణకు తెర
'దశావతారం' చిత్ర తర్వాత పద్మశ్రీ కమల్ హాసన్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఈనాడు'. తమిళంలో 'ఉన్నైపోల్ ఒరువన్' పేరుతో ఈ చిత్రం రూపొందింది. కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ తెలుగు వెర్షన్ లో ప్రధాన పాత్రలు పోషిస్తుంటగా, కమల్, మోహన్ లాల్ తమిళ వెర్షన్ లో కలిసి నటిస్తున్నారు. యూటీవీ, రాజ్ కమల్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా చక్రి తోలేటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హిందీలో విజయవంతమైన 'ది వెన్స్ డే' సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. దసరా కానుకగా సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈనెల 31న ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
టెర్రరిజం నేపథ్యంలో 'ఈనాడు' చిత్రం రూపొందింది. తొలుత ఈ చిత్రాన్ని కమల్ 50 నటవసంతాలు పూర్తయిన సందర్భంలో ఈనెల 12న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా విడుదల తేదీ మారింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ విడుదల హక్కులను అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత జి.కుమార్ బాబు తీసుకున్నారు. కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ తొలిసారి ఈ చిత్రానికి సంగీతం అందించగా, కమల్ స్యయంగా ఓ పాట పాడారు. కమల్ చిన్న కూతురు అక్షర తమిళ వెర్షన్ కోసం 'వానమ్ ఎల్లై ఇళ్లై' అనే పాటకు కొరియోగ్రఫీ అందించడం మరో విశేషం.
Be first to comment on this News / Article!
|