నాగార్జున 'పయనం'
'కింగ్' చిత్రం తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న యువసామ్రాట్ నాగార్జున మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. తన కుమారుడు నాగచైతన్య తొలిచిత్రం 'జోష్' సెప్టెంబర్ 3న విడుదలకు సిద్ధమవుతుండటం, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య రెండో చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకోడవంతో నాగార్జున రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న చిత్రంలో నాగార్జున ప్రస్తుతం నటిస్తున్నారు. కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నాగార్జునకు జోడిగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. నాగార్జున డిసెంబర్ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్నిఅప్పటికి పూర్తి చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ చిత్రంతో పాటు మరో కొత్త చిత్రంలో కూడా నటించేందుకు నాగార్జున సుముఖంగా ఉన్నారు. దీనికి రాధామోహన్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రకాష్ రాజ్-త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన 'ఆకాశమంత' చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. రాధామోహన్ వర్కింగ్ స్టైల్, ఆయన చెప్పిన ఓ స్టోరీలైన్ నచ్చడంలో నాగార్జున ఆయనతో పనిచేసేందుకు ఆసక్తి చూపారని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనుందనీ, దేవీశ్రీప్రసాద్ ను సంగీత దర్శకుడిగా అనుకుంటున్నారనీ సమాచారం. దీనికి 'పయనం' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. టైటిల్ తరహాలోనే విలక్షణ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని అనుకోవచ్చు. పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
Be first to comment on this News / Article!
|