నమిత ఎవరికి పోటీ?
భారీ అందాల బ్యూటీ నమితకు ఈరోజు లక్షలాది మంది అభిమానులు ఉన్నాయి. దక్షిణాదిన మరీ ముఖ్యంగా తమిళనాట ఆమెకున్న అభిమాన సంఘాల సంఖ్య కూడా ఎక్కువే. ఆమె పేరిట అభిమానులు ఏకంగా ఓ గుడి కూడా కట్టేశారు. నమిత ఈ రేంజ్ కు చేరుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన సంఘటనే ఉంది. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన మిస్ వరల్డ్ పోటీలో ఆమెకు ఎదురైన చేదు అనుభవమే ఆమెలో పట్టుదలను పెంచిందట. ఆరోజు ఆమెకు పోటీదారుగా నిలిచి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కుంచుకున్న నటి మరెవరో కాదు...బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా. ఆరోజు తాను ఫైనల్ రౌండ్ కు క్వాలిఫై కాకపోవడమే తనలో పట్టుదల పెంచిందనీ, తనకు ప్రధాన పోటీదారు అయిన ప్రియాకం చోప్రాకు తాను ఎంతమాత్రం తక్కువ కాదనే పోటీతత్వమే ఈనాడు తన ఎదుగులకు కారణమైందనీ నమిత చెప్పుకొచ్చింది.
'మిస్ వరల్డ్ క్వాలిఫైయింగ్ రౌండ్ కు వెళ్లినప్పుడు జ్యూరీ సభ్యులు నన్ను ఎంపిక చేయలేదు. నాకు ఇంగ్లీషు తెలియదనే నెపంతోనే దూరంగా ఉంచారు. ప్రియాంక చోప్రా విజేతగా నిలిచి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఆంగ్ల భాషపై పట్టు సాధించి సినిమాల్లో అగ్రస్థానం సంపాదించుకోవాలనే నిర్ణయం ఆ రోజునే తీసుకున్నాను. అదే జరిగింది. ఇప్పుడు లక్షలాది మంది అభిమానం సంపాదించుకున్నాను. ఆ రోజు చేసిన సవాలే ఈరోజు నా ఎదుగులకు కారణమైంది' అంటూ నమిత సంతోషంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన కెరర్ ఉజ్వలంగా ఉందనీ, తెలుగులో 'దేశద్రోహి', ద్విభాషా చిత్రం 'జగన్మోహిని' లో లీడ్ రోల్స్ పోషిస్తున్నాననీ, బాలకృష్ణ సినిమాకు కమిట్ అయ్యాయనీ చెప్పుకొచ్చింది. మరోవైపు ఓ కన్నడ చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయనీ, మలయాళంలో కూడా సత్తా చాటుకోవాలని అనుకుంటున్నాననీ చెప్పుకొచ్చింది. మిత్రులు, శ్రేయాభిలాషుల సూచన మేరకు ఆరు కిలోల బరువు కూడా తగ్గాయని తెలిపింది.
Be first to comment on this News / Article!
|