'రుద్రమనుషులు'గా ధూమ్స్ డే
హాలీవుడ్ లో విజయవంతమైన 'ది ధూమ్స్ డే' చిత్రాన్ని సురేష్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై 'రుద్రమనుషులు'గా తెలుగులోకి అనువదిస్తున్నారు. నీల్ మార్షల్ దర్శకుడు. చిత్ర నిర్మాతలు వెంకట్ సునీల్, సాయి సుమంత్ చిత్ర విశేషాలను తెలియజేశారు.
బ్లడ్ ఫ్లూ వంటి అంటువ్యాధులు లండన్ నగరంలో ఉన్న గ్లాస్కో పట్టణమంతా వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాధికి చికిత్స లేనందున వేలాది మంది చనిపోతారు. మిగిలిన వారు భయం గుప్పిట్లో చిక్కుకుంటారు. రాజకీయాల కారణాల వల్ల లండన్ ప్రభుత్వం ఏమీ చేయలేక గ్లాస్కో నగరాన్ని స్కాట్ లాండ్ నుంచి వేరు చూస్తూ ఓ మెటల్ వాల్ ను నిర్మిస్తుంది. 20 ఏళ్ల తర్వాత బ్లడ్ ఫ్లూ నీరు, గాలి కారణంగా నగరమంతా వ్యాప్తి చెందుతుంది. లండన్ ప్రభుత్వం శాటిలైట్ ద్వారా గ్లాస్కో నగరంలో ఇంకా మనుషులు జీవించి ఉన్నారని తెలుసుకుని, అక్కడి సైంటిస్టులు వ్యాధి వ్యాక్సిన్ కనిపెట్టి ఉంటారనే ఉద్దేశంతో సైన్యంలోని ఒక కమాండర్ తో సహా కొంతమందిని గ్లాస్కో నగరంలోకి పంపుతుంది. గ్లాస్కో నగరంలో మిగిలి ఉన్న మనుషులు బయట ప్రపంచంతో సంబంధాలు లేని కారణంగా ప్రభుత్వం మీద కోపంతో రుద్రమనుషులుగా మారుతారు. ఆ రుద్రమనుషులకూ, ఆర్మీ కమాండర్ కూ జరిగే పోరాటాలు, మనిషిని మనిషి చంపితినే దృశ్యాలు అత్యద్భుతంగా నీల్ మార్షల్ తెరకెక్కించారని నిర్మాతలు తెలిపారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
|