'ఈనాడు' లోగో-ట్రైలర్స్ 29న
యూనివర్శల్ హీరో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'ఈనాడు' చిత్రం సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. అమ్మ ఆర్ట్స్ అధినేత జి.కుమార్ బాబు ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఈనెల 29న ఈ చిత్రం లోగో, ట్రైలర్స్ ఆవిష్కరణ జరుగుతుందనీ, కమల్, వెంకటేష్ తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందనీ జి.కుమార్ తెలిపారు.
'ది వెన్స్ డే' చిత్రం తనను ఎంతో ఇన్ స్పైర్ చేసిందనీ, దీంతో సొంత బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించాననీ కమల్ హాసన్ తెలిపారు. ఇది తన తన కెరీర్ లోనే సంచలన చిత్రమనీ, ఈనాటి సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే విధంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో పెద్ద హిట్టవుతుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషించారనీ, దర్శకుడు చక్రి తేలేటి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ తెలిపారు. 'దశావాతరం' తర్వాత 'ఈనాడు' చిత్రం తనకెంతో సంతృప్తి నిచ్చిందనీ చెప్పారు. వెంకటేష్ మాట్లాడుతూ, సినిమా పట్ల అంకితభావంతో పనిచేసే గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ అనీ, ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందనీ చెప్పారు. మంచి పర్పస్ ఉన్న పవర్ ఫుల్ సినిమా ఇదని అన్నారు. ఈ చిత్రం తెలుగు హక్కులు తనకు దక్కడం పట్ల జి.కుమార్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. కమల్ కుమార్తె శ్రుతి హాసన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేస్తామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పూనమ్ కౌర్, భరత్ రెడ్డి, గణేష్, లక్ష్మీ, శివన్నారాయణ తదితరులు నటించారు. మనోజ్ సోని సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|