ఎన్టీఆర్ తో ఛార్మి ఆటపాట
'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' చిత్రాల తర్వాత గ్లామర్ నటి ఛార్మి రూటు మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమవుతూ లోబడ్జెట్ చిత్రాలు, సెకెండ్ గ్రేడ్ హీరోలతో నటిస్తూ వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'సుందరకాండ', '16 డేస్' 'కావ్యాస్ డైరీ' వంటి చిత్రాలు ఫెయిల్యూర్స్ చవిచూశాయి. నిర్మాణం పూర్తయిన 'మాయగాడు' ఇంతవరకూ వెలుగు చూడలేదు. ఈ నేపథ్యంలో ఛార్మి మళ్లీ స్టార్ హీరోలతో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పుడు మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జతకడుతోంది. కృష్ణవంశీ 'రాఖీ' చిత్రంలో ఓ హీరోయిన్ గా నటించిన ఛార్మి ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుర్స్' చిత్రంలో ఓ ఐటెం సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి నర్తించనుంది. దీంతో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూనే పెద్ద బ్యానర్లు, హీరోలతో నటించే ఛాన్స్ వస్తే ఐటెం సాంగ్స్ కు కూడా వెనుకాడేది లేదని ఛార్మి ఫీలర్ వదిలనట్టయింది.
'కంత్రి' తర్వాత ఎన్టీఆర్ కు సైతం 'అదుర్స్' చిత్రం కీలకం కాబోతోంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా నయనతార, షీలా నటిస్తున్నారు. కీలకమైన విలన్ పాత్రను బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత మహేష్ మంజ్రేకర్ పోషిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ పై వల్లభనేని వంశీ మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
Be first to comment on this News / Article!
|