వరుడు...కిలాడీ...ఖల్లాస్!
'అతిథి' చిత్రం తర్వాత దాదాపు రెండేళ్లుగా ప్రిన్స్ మహేష్ నటించిన కొత్త చిత్రం ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఏడాదికి రెండు సినిమాల్లో నటిస్తానంటూ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టకోలేకపోయినందుకు చింతిస్తున్నట్టు మహేష్ ఇటీవల థమ్సప్ ప్రమోషన్ కార్యక్రమంలో వివరణ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా తన నుంచి కనీసం రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ తో పాటు రాజస్థాన్, పొల్లాచ్చిలో కీలకమైన షెడ్యూల్స్ ప్లానింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 10 నుంచి రాజస్థాన్ లో నెలరోజుల పాటు ఓ కీలక షెడ్యూల్ జరుగనుంది. మహేష్, కథానాయిక అనుష్కతో పాటు కీలక తారాగణమంతా పాల్గొంటారు.
రాజస్థాన్ షెడ్యూల్ లో కొన్ని పాటలు, ఫైట్స్, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ చిత్రంలో మహేష్ టాక్సీ డ్రైవర్ గా కనిపించబోతున్నారనీ, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ అంటున్నారు. ఈ చిత్రానికి 'వరుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ వేరే టైటిల్ నిశ్చయించే అవకాశం ఉంది. 'కిలాడీ, 'ఖల్లాస్' అనే టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. 2010 సంక్రాంతికి ఈ చిత్రం విడుదలవుతుంది.
Be first to comment on this News / Article!
|