'పదహారేళ్ల వయసు' పాటలు
భూషణ్, ఆర్యా ఒరా హీరోహీరోయిన్లుగా శ్రీసూర్య దర్శకత్వంలో డైరెక్టర్స్ మూవీ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పదహారేళ్ల వయసు'. బుధవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. దర్శకుడు శ్రీసూర్య తల్లి గంగమ్మ, హీరో భూషణ్ తల్లి భుననేశ్వరి సంయుక్తంగా ఆడియో సీడీని ఆవిష్కరించి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంకొండ సురేష్ కు అందజేశారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ఈ చిత్రం ట్రైలర్స్ చూశాననీ, చాలా బాగున్నాయనీ అన్నారు. దర్శకుడు, హీరో తల్లులతో ఆడియో విడుదల చేయించడం అభినందనీయమని అన్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తన శక్తి నంతా ధారపోసి ఈ సినిమా తీశాననీ, తాను దర్శకుడు కావడానికి తన తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారనీ శ్రీసూర్య తెలిపారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ, గతంలో ఇదే పేరుతో వచ్చిన సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసనీ, అంత బాగా పాటలు రావాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశాననీ సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ తెలిపారు. ఈ చిత్రం తమకు మంచిపేరు తెచ్చిపెడుతుందని భూషణ్, ఆర్యా ఒరా తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు హర్షవర్దన్, గుండు సుదర్శన్, ఛాయాగ్రాహకుడు భాష, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు కిలారి హరిప్రసాద్, యండవల్లి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|