సంజనతో ఒకరోజు...
'లక్స్' ప్రమోషన్ పేరుతో శ్రియ, మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ 'కోల్గేట్' ప్రమోషన్ కోసం త్రిష ఇంటింటికి వెళ్లి ప్రమోషన్ చేస్తున్నారు. అభిమానులను కలుసుకునే అవకాశం ఈ రూపంలో తారలకూ లభిస్తుంటుంది. ఇప్పుడు ఎస్.ఎం.ఎస్.ల విప్లవం కూడా వచ్చింది. పలువురు తారలను అభిమానులకు అనుసంధానిస్తూ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాంటి ఒక సంస్థ టాలీవుడ్ హాట్ గాళ్ సంజనతో అభిమానులను కలుపుతూ ఓ కాంటెస్ట్ ఏర్పాటు చేసింది. సంజన కన్నడంలో మంచి పేరు తెచ్చుకుని తెలుగులో పూరీ జగన్నాథ్ తీసిన 'బుజ్జిగాడు'తో పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన 'సత్యమేవ జయతే' విడుదల కాగా, 'పోలీస్ పోలీస్', 'సమర్ధుడు' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
సంజన ఫ్యాన్స్ కు చెందిన వారు ఎస్ఎంఎస్ ల కాంటెస్ట్ లో పాల్గొన వచ్చు. ఇందుకు కావాల్సిందంతా మీకుంటూ ఓ మొబైల్ ఫోన్, క్రియేటివ్ మైండ్, రొమాంటిక్ హార్ట్ ఉంటే చాలు. మీ రొమాంటిక్ మెసేజ్ ను 567678కు పంపాల్సి ఉంటుంది. ఈనెల 24 నుంచి ఈ కాంటెస్ట్ మొదలైంది. మరో మూడు నాలుగు వారల తర్వాత ముగుస్తుంది. కాంటెస్ట్ లో విజేతగా నిలిచిన వ్యక్తికి సంజనను కలుసుకునే అవకాశం దక్కుతుంది. ఈ కాంటెస్ట్ పట్ల సంజన సైతం చాలా ఎగ్జయింటింగ్ గా ఉంది. 'ఫ్యాన్ కమ్యూనిటీ ద్వారా అభిమానులతో నేరుగా ముచ్చటించే అవకాశం రావడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ప్రతి ఒక్క అభిమానిని కలుసుకోవాలని నాకూ ఉంది. అయితే కాంటెస్ట్ ప్రకారం అభిమానుల్లో కనీసం ఒకరినైనా కలుసుకునే అవకాశం కలుగుతుంది. ఆరోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను' అంటోంది సంజన సంబరంగా. మీరూ సంజన ఫ్యాన్ క్లబ్ కు చెందిన వారైతే ఇంకెందుకు ఆలస్యం ఎస్.ఎం.ఎస్. కొట్టండి...
Be first to comment on this News / Article!
|