గెస్ట్ హౌస్ లో 'జెంటిల్ మెన్'
పెళ్లయిన తొలినాళ్లలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అయితే మూడునాలుగేళ్ల తర్వాత గతంలో భార్యపై చూపించిన ప్రేమను కొందరు భర్తలు చూపించలేకపోతుంటాడు. ఇందుకు సహేతుకమైన కారణాలతో 'జెంటిల్ మెన్' చిత్రం తెరకెక్కుతోంది. పోసాని కృష్ణమురళి కథానాయకుడి పాత్ర పోషిస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఆయనకు జోడిగా ఆర్తి అగర్వాల్ నటిస్తోంది. వీరభద్ర ప్రొడక్షన్స్ పతాకంపై నల్లం శ్రీనివాస్ మసర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ ఫిలింనగర్ లోని ఓ గెస్ట్ హౌస్ లో జరుగతోంది. మరో రెండు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని శుక్రవారంనాడు షూటింగ్ లొకేషన్ లో పోసాని తెలిపారు.
ఈ చిత్రంలో తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్నాననీ, సాధ్యమైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి అక్టోబర్ లో సినిమా విడుదల చేస్తామనీ పోసాని అన్నారు. సందేశంతో కూడిన చిత్రాలు తీయడంలో పోసానికి ప్రత్యేకత ఉందనీ, ఇందులో తాను ఓ సైంటిస్ట్ పాత్ర పోషిస్తున్నాననీ కోట శ్రీనివాసరావు తెలిపారు. చిత్ర సమర్పకుడు నల్లం శ్రీనివాస్, నిర్మాత నల్లం పద్మజ, నటులు చలపతిరావు, జ్యోతి తదిరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా లండన్ కు చెందిన లూయూస్, ఇతర పాత్రల్లో నాగబాబు, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, జితన్, వకీల్ ఖాన్, సురేఖా వాణి, సత్యశ్రీ, రోషిణి తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం పోసాని అందిస్తున్న ఈ చిత్రానికి వీణా సి.ఆనంద్ సినిమాటోగ్రఫీ, రవీంద్రబాబు ఎడిటింగ్, మల్లిక్ శర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|