నాగార్జున కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో వైవిధ్యమైన సినిమాగా కామాక్షి మూవీస్ చిత్రం తెరకెక్కుతోందనీ ఆ చిత్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి తెలిపారు. నాగార్జున కథానాయకుడుగా కామాక్షి కళా మూవీస్ పతాకంపై ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రం నాన్ స్టాప్ గా షెడ్యూల్ జరుపుకొంటోంది. కిరణ్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈనెల 29న నాగార్జున బర్త్ డే ను పురస్కరించుకుని ఈ చిత్ర విశేషాలను
శివప్రసాద్ రెడ్డి తొలిసారిగా తెలియజేశారు.
నాగార్జునతో 'విక్కీదాదా', 'అల్లరి అల్లుడు', 'సీతారామరాజు', 'కింగ్' చిత్రాలను నిర్మించిన తాము మరో చిత్రం నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ, తనకు మంచి మిత్రుడైన నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలనీ శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ చిత్రం ద్వారా కిరణ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నామనీ, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ డిఫరెంట్ స్టయిల్ లో సాగే ఎంటర్ టైనర్ ఇదనీ చెప్పారు. గోవాలో నెలరోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశామనీ, నవంబర్ 20 వరకూ ఏకధాటిగా జరిగే షూటింగ్ తో చిత్రం పూర్తవుతుందనీ చెప్పారు. డిసెంబర్ లో రిలీజ్ ఉంటుంద్నారు. ఈ చిత్రంతో నాగార్జునకు, తమ బేనర్ కు మరో హిట్ ఖాయమనీ, ప్రేక్షకాభిమానులను విశేషంగా అలరించే అన్ని అంశాలు చిత్రంలో ఉన్నాయనీ చెప్పారు. అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం కిరణ్ అందిస్తుండగా, సర్వేస్ మురారి సినిమాటోగ్రఫీ, సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. అక్కినేని వెంకటరత్నం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|