దుబాయ్ కి 'సారాయి వీర్రాజు'
అజయ్ కథానాయకుడుగా డి.ఎస్.కణ్ణన్ దర్శకత్వంలో విశాలాక్షి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'సారాయి వీర్రాజు'. ఈ చిత్రం ఇంతవరకూ 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన 10 శాతం షూటింగ్ దుబాయ్ లో చేయనున్నట్టు కణ్ణన్ తెలిపారు. శుక్రవారంనాడు ప్రసాద్ ల్యాబ్యాస్ లో చిత్ర విశేషాలను ఆయన తెలియజేశారు.
దుబాయ్ లో ఒకపాటతో పాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామనీ, మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయనీ ఆయన చెప్పారు. హైద్రాబాద్, నర్సీపట్నంలలో ఈ చిత్రం షూటింగ్ చేశామన్నారు. సహజంగా గ్రామీణ నేపథ్యం అనగానే అంతా కోనసీమను ఎంచుకుంటారనీ, అయితే తాము నర్సీపట్నం ఎంచుకోవడానికి కథే కారణమనీ చెప్పారు. సహజత్వానికి దగ్గరగా ఉండాలనే తపనతో దాదాపు 50 డిగ్రీల మండుటెంటల్లో షూటింగ్ చేశామన్నారు. పల్లెటూరుకు సంబంధించిన ఎపిసోడ్స్ నర్సీపట్నంలో చేశామన్నారు. అక్కడి స్థానికులకే శిక్షణ ఇచ్చి వారిని నటింపజేశామని తెలిపారు. అజయ్ తో పాటు ఆర్టిస్టులంతా చక్కగా నటించారనీ, ఫోటోగ్రఫీ, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ అవుతాయని అన్నారు. మొత్తం 9 పాటలు సినిమాలో ఉంటాయని తెలిపారు. హీరో అజయ్ మాట్లాడుతూ, ఇందులో ఎక్కువ మంది కొత్తవాళ్లే నటిస్తున్నారనీ, యాక్షన్ తో పాటు మంచి ఫీల్ ఉన్న పక్కా కమర్షియల్ చిత్రమిదని అన్నారు. సెప్టెంబర్ 16న ఆడియో రిలీజ్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అజయ్, రమ్య, మధులిక, ఛాయ్ బిస్కెట్ రమ్య, ముమైత్ ఖాన్, బేబి అన్ని, జోగినాయుడు తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం డి.ఎస్.కణ్ణన్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి విశ్వ సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, శ్రీ సాయి సంగీతం అందిస్తున్నారు.

Be first to comment on this News / Article!
|