చరణ్...రెస్ట్ తీసుకో
'మగధీర' చిత్రం కోసం రామ్ చరణ్ పడిన కష్టం స్క్రీన్ పై కొటొచ్చినట్టు కనిపిస్తుంది. కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీ, రాజస్థాన్ లో భారీ షెడ్యూల్స్...ఇలా చరణ్ పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతోంది. ప్రేక్షకుల విశేష ఆదరణతో భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే హైద్రాబాద్ లో 'మగధీర' ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్యను కూడా పెంచారు. ప్రస్తుతం ఇతర చిత్రాల పోటీ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అప్రతిహతంగా సెప్టెంబర్ 3వ వారానికి 'మగధీర' 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన తదుపరి చిత్రంలో నటించేందుకు రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు. అయితే 'మగధీర' సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాతే మళ్లీ వర్క్ షెడ్యూల్ లో అడుగుపెట్టాల్సిందిగా సహజమైన పుత్ర ప్రేమతో చిరంజీవి ఆయనకు సలహా ఇచ్చారని తెలుస్తోంది. 'ముందు సక్సెస్ ను ఎంజాయ్ చేయ్. ఇందుకు కొంత రెస్ట్ కూడా అవసరం' అంటూ ఆయన చరణ్ భుజం తట్టారట.
తండ్రి కళ్లలో సంబరాన్ని చూడటం రామ్ చరణ్ ను కూడా ఆనందంలో ముంచెత్తుతోంది. 'మగధీర చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ కొద్దిగా బ్రేక్ తీసుకుంటే బాగుంటుందని నాన్నగారు అభిప్రాయపడుతున్నారు. అయితే వర్క్ పట్ల నాకున్న మమకారం నన్ను నిలువనీయడం లేదు. ఎప్పుడెప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వెళ్తానా అని తహతహలాడుతున్నాను' అంటూ చరణ్ వృత్తిపట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంటున్నారు. రామ్ చరణ్ తృతీయ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడి అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నాగేంద్రబాబు నిర్మించనున్నారు. సెప్టెంబర్ చివర్లో షూటింగ్ మొదలవుతుంది.
Be first to comment on this News / Article!
|