అభిమానుల మధ్య నాగ్ బర్త్ డే
అక్కినేని నాగార్జున 50వ బర్త్ డే ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానుల సమక్షంలో శనివారంనాడు సందడిగా జరిగింది. హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ లోని అక్కినేని నాగేశ్వరరావు నివాసంలో ఈ వేడుక జరిగింది. ఆలిండియా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో నాగార్జున తన బర్త్ డే కేక్ ను కట్ చేసి అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ జర్నలిస్టుకు ఏటా ఇచ్చే స్వర్ణకంకణాన్ని సీనియర్ జర్నలిస్టు పి.శరత్ కుమార్ కు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా అందించి సన్మానించారు. అంతకుముందు ఆలిండియా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రవీంద్రరెడ్డి సారథ్యంలో అభిమానులు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని కలుసుకుని 'ఆరోగ్య శ్రీ' పథకానికి 50 వేల రూపాలయ విరాళాన్ని చెక్కురూపంలో అందజేశారు.
నాగార్జునకు ఉదయం ఆయన నివాసంలో కలుసుకుని బర్త్ డే శుభాకాంక్షలు తెలియ చేసిన వారిలో కె.రాఘువేంద్రరావు, సి.కల్యాణ్, సి.అశ్వనీదత్, డి.శివప్రసాద్ రెడ్డి, గౌతంరాజు, లారెన్స్, హేమ తదితరులు ఉన్నారు. నాగార్జున వెంట ఆయన శ్రీమతి అమల, కుమారుడు అఖిల్ కూడా ఉన్నారు.
Be first to comment on this News / Article!
|