వర్మ 'ఫూంక్ -2'
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన 'ఫూంక్' (తెలుగులో 'రక్ష') చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు. వర్మ సమర్పణలో ప్రశాంత్ బుర్రా, పి.చంద్రశేఖర్ నిర్మాతలుగా మిలింద్ గడాఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీనిని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నట్టు వర్మ తెలిపారు. హైద్రాబాద్ లోని తాజ్ బంజారాలో శనివారంనాడు జరిగిన కార్యక్రమంలో వర్మ ఆ విశేషాలను తెలియజేశారు.
'ఫూంక్-2' చిత్రం షూటింగ్ జరుగుతోందనీ, తెలుగు వెర్షన్ టైటిల్ ఇంకా నిర్ణయించలేదనీ వర్మ తెలిపారు. 'ఫూంక్' చిత్రం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే 'ఫూంక్-2' మొదలవుతుందన్నారు. ఫూంక్ చిత్రానికి తన అసోసియేట్ గా చేసిన మిలింద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనీ, ఈ సీక్వెల్ కు ఆయనే స్క్రిప్టు రచన చేశారనీ తెలిపారు. 2010 ఫ్రిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|