'ఈనాడు'లోగో ఆవిష్కరణ
వెంకటేష్ మాట్లాడుతూ, నటుడుగా తాను కమల్ హాసన్ ను ప్రేరణగా తీసుకుంటాననీ, ఎమోషన్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఆయన నుంచే తాను స్ఫూర్తి పొండటాన్ని ప్రేక్షకులు పోల్చుకుంటూ ఉంటారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందనీ, తమ రెండు పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయనీ అన్నారు. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి చిత్రాలు మరిన్ని వస్తాయన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ, ప్రతిభ ఆధరంగానే ఇందులో చక్రిని దర్శకుడుగా తీసుకున్నామనీ, అదే సూత్రం శృతికి కూడా వర్తిస్తుందనీ అన్నారు. రామానాయుడు గారితో తనకు మంచి స్నేహం ఉందనీ, వారి నిర్మాణ సంస్థ తన సొంత సంస్థలాంటిందనీ అన్నారు. వెంకటేష్ అయితేనే ఇందులోని పాత్రకు న్యాయం చేయగలరని అనిపించి నాయుడు గారిని సంప్రదించాననీ, ఆయన ప్రోద్బలంతోనే వెంకటేష్ ఈ పాత్ర చేయడానికి అంగీకరించారనీ అన్నారు. తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకంతో ఈ సినిమా తీశాననీ, త్వరలోనే ఓ డైరెక్ట్ సినిమా కూడా చేస్తాననీ అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|