నిర్మాతల మండలికి శ్యామ్
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడుగా ప్రముఖ నిర్మాత ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎంపికయ్యారు. 2009-11 సంవత్సరాలకు సంబంధించి నిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారంనాడు జరిగాయి.
ఈ ఎన్నికల్లో మండలి ఉపాధ్యక్షులుగా సి.వి.రెడ్డి, సాగర్ ఎంపికయ్యారు. కార్యదర్శులుగా అశోక్ కుమార్, టి.ప్రసన్న కుమార్, సంయుక్త కార్యదర్శలుగా నట్టికుమార్, వై.సురేందర్ రెడ్డి ఎంపికకాగా, కోశాధికారిగా స్రవంతి రవికిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో పదిహేను మంది నిర్మాతలు కార్యవర్గ సభ్యులుగా ఉంటారు.
Be first to comment on this News / Article!
|