రవీందర్ తోట కొత్త సినిమా
తొలి సినిమా సక్సెస్ అయితే డాక్టర్ డి.రామానాయుడులా 150 వరకూ సినిమాలు తీస్తానని సినిమా నిర్మాణం పట్ల తనకున్న అభిమానం చాటుకుంటున్న ప్రముఖ ఎన్.ఆర్.ఐ. రవీందర్ కుమార్ తోట 'యు అండ్ ఐ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జెఎస్ఎంఎన్ సినిమా పతాకంపై రోహన్, అదితి చౌదరి హీరోహీరోయిన్లుగా రంజిత్ బెల్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ఆడియో రిలీజ్ జరుపుకొంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. తాజాగా రవీందర్ కుమార్ తోట తన బ్యానర్ నుంచి మరో కొత్త చిత్రాన్ని ప్రకిటంచారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్న ఈ చిత్రానికి కృష్ణవంశీ శిష్యుడు శ్రీరామ్ నేని తొలిసారిగా దర్శకత్వం వహించనున్నారు.
రవీందర్ తోట ఆ విషయాన్ని తెలియజేస్తూ, తమ సంస్థ తొలి చిత్రం ఆడియో విజయవంతమైందనీ, ఆడియో ద్వారా వచ్చిన మొత్తాన్ని హన్మకొండలోని ఓ అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చామనీ చెప్పారు. తొలి చిత్రం ఇచ్చిన అనుభూతిని దృష్టిలో ఉంచుకుని మలి చిత్రానికి సన్నాహాలుచేస్తున్నామనీ, ధనార్జన కోసం కాకుండా మంచి చిత్రాల నిర్మాణం కోసమే అమెరికా నుంచి సినీ రంగానికి వచ్చాననీ ఆయన చెప్పారు. శ్రీరామ్ నేని చెప్పిన స్టోరీలైన్, సినిమా పట్ల తనకున్న కమిట్ మెంట్ నచ్చడంతో ఆయనను దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని అన్నారు. ఈ చిత్రానికి వేటూరి-సిరివెన్నెల సాహిత్యం, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, పద్మశ్రీ తోట తరణి కళాదర్శకత్వం, బి.ఎల్.సంజయ్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అచ్చు సంగీతం అందించనున్నారు. శ్రీమతి యశోధరా దేవి చిత్ర సమర్పకురాలిగా వ్యవహరిస్తారు.
Be first to comment on this News / Article!
|