ఉదయ్ బాబు మలి చిత్రం
ప్రముఖ కమెడియన్ బాబూమోహన్ తనయుడు ఉదయ్ బాబు మరో కొత్త చిత్రంలో హీరోగా నటించబోతున్నారు. 'శ్రీ సమక్క సారక్క మహాత్మ్యం' చిత్రం ద్వారా ఉదయ్ బాబు తెలుగులో హీరోగా అడుగుపెట్టారు. ఆ చిత్రం అర్ధ శతదినోత్సవం సైతం జరుపుకొంది. తాజాగా ఆయన హీరోగా నటించనున్న రెండో చిత్రాన్ని అనిల్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎడ్ల జోగిరెడ్డి, వి.సత్యనారాయణ గౌడ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. వేముగంటి దర్శకత్వం వహించనున్నారు.
పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో, ఉదయ్ బాబు బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు తెలిపారు. 'గంగ', 'శ్రీ సమక్క సారక్క మహాత్మ్యం' చిత్రాలకు దర్శకత్వం వహించిన వేముగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారనీ, ప్రస్తుతం హీరోయిన్, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోందనీ చెప్పారు. దసరా పర్వదినం రోజున ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|