'కొంటెకుర్రాడు పెంకిపిల్ల'
తమిళంలో క్రేజీ హీరోగా పేరున్న సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన ఓ చిత్రం తెలుగులోకి అనువాదం కానుంది. 'కొంటెకుర్రాడు పెంకిపిల్ల' అనే టైటిల్ తో వై.శ్రీనివాస్ సమర్పణలో ఫ్యూచర్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తోంది. దీనికి సుబ్రమణ్యం శివ దర్శకుడు.
చిత్ర సమర్పకుడు శ్రీనివాస్ ఆ విశేషాలను తెలియజేస్తూ, డిగ్రీ వరకూ చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఓ పెంకిపిళ్లను ప్రేమంచిన హీరో ఆ తర్వాత తండ్రి మందలించడంతో తన బాధ్యతలను తెలుసుకుంటాడనీ, ఆ క్రమంలో అతని జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. సకుటుంబ సమేతంగా చూడదగిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తమిళంలో పెద్ద సక్సెస్ అయిందన్నారు. సెప్టెంబర్ 10 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించి నెలాఖరు కల్లా తొలి కాపీ తీసుకువస్తామని చెప్పారు. ఈ చిత్రంలో ధనుష్ కు జోడిగా ఛాయసింగ్ నటించింది. సుకీ, కరుణాస్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భాస్కరభట్ల పాటలు, జి.రమేష్ సినిమాటోగ్రఫీ, దిన సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|