సోషియో మైథలాజికల్ 'శబరి'
కొత్త, పాత తారలతో సిఎస్.ఆర్.ఫిలిమ్స్ అనే నూతన నిర్మాణ సంస్థ తొలి ప్రయత్నంగా 'శబరి' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త నరసింహరెడ్డి చాట్ల నిర్మాతగా హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 రోజుల పాటు ఏకథాటిగా జరిపిన షెడ్యూల్స్ తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ద్వారా జయశేఖర్ కల్లు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆ విశేషాలను తొలిసారిగా చిత్రయూనిట్ తెలియజేసింది.
సమాజానికి మేలుచేసే చిత్రాలను నిర్మించాలనే సంకల్పంతో సిఎస్ఆర్ ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించామనీ, వైవిధ్యమైన కథాకథనంతో రూపొందిన సోషియో మైథలాజికల్ చిత్రమిదని నిర్మాతలు నరసింహారెడ్డి చాట్ల, రవిచాట్ల తెలిపారు. అన్ని హంగులూ పూర్తి చేసుకుని త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. దర్శకుడు జయశేఖర్ మాట్లాడుతూ, తాను చెప్పిన కథ నచ్చి తన మీద నమ్మకంతో తనకు దర్శక బాధ్యతలు అప్పగించిన నిర్మాతలకు కృతజ్ఞతలని అన్నారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని చెప్పారు. ఇందులో ఐదు పాటలకు యువ సంగీత దర్శకుడు పి.రాజ్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారనీ, సినిమా సక్సె స్ లో ఆడియో కీలకమవుతుందనీ అన్నారు. అలాగే కల్యాణ్ కెమెరా వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో రూపాకౌర్, మధులిక, సృజన్, రామిరెడ్డి, జీవా, కొండవలస, మేల్కొటి, అల్లం సుహాసిని, జూనియర్ రేలంగి తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం జయశేఖర్ కల్లు అందించారు.
Be first to comment on this News / Article!
|