'బిందాస్'కు ర్యాప్ సింగర్స్
మంచు మనోజ్ కథానాయకుడుగా ఏటీవీ సమర్పణలో ఏ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రానికి ఇటీవలే 'బిందాస్' (అజయ్ గాడి విజయ గాథ) అనే టైటిల్ ఖరారు చేశారు. బాలకృష్ణ చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ కూడా జరిగింది. రచయిత వీరూపోట్ల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా కూడా పరిచయమవుతున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా బొబో శశిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. బోబో శశితో పాటు ఈ చిత్రం కోసం రెండు ర్యాప్ సాంగ్స్ ఆలపించిన మలేసియాకు చెందిన ర్యాప్ సింగర్స్ ను ఫిలిం చాంబర్ లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పరిచయం చేసింది.
మంచు మనోజ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని ర్యాప్ సాంగ్స్ ను ఒరిజనల్ ర్యాప్ సింగర్స్ తోనే పాడించాలని భావించి మలేషియాకు చెందిన 'బూమె రాంగ్' బ్యాండ్ సింగర్స్ తో పాడించామనీ, తమిళంలో ఓ సినిమాకి పనిచేసిన బొబో శశి ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారనీ తెలిపారు. బెబో శశి చాలా మంచి సంగీతం అందించారని చెప్పారు. ఫైట్స్, సాంగ్స్ మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయిందనీ, త్వరలోనే పొల్లాచ్చి లో షూటింగ్ జరిపి అక్టోబర్ చివరి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత సుంకర రామబ్రహ్మం తెలిపారు. బొబో శశి, ర్యాప్ సింగర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|