ఫిల్మ్ సిటీలో 'సింహా'
నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న 'సింహా' చిత్రం రెగ్యులర్ షూటింగ్ లోకి అడుగుపెట్టింది. ఇటీవలే ముహూర్తం జరుపుకొన్న ఈ చిత్రం బుధవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకొంటోంది.
బాలకృష్ణ కెరీర్ లో ఇంతవరకూ పోషించనటువంటి విలక్షణ పాత్రను ఇందులో పోషిస్తున్నారనీ, సేవియర్ గా ఆయన పాత్ర ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. బాలకృష్ణ, మలయాళ నటుడు సాయికుమార్ పై కొన్ని పోరాట దృశ్యాలను వారం రోజుల పాటు ఆర్.ఎఫ్.సి.లో చిత్రీకరించనున్నామనీ, వరుస షెడ్యూల్స్ తో డిసెంబర్ నాటికల్లా షూటింగ్ పూర్తి చేస్తామనీ చెప్పారు. 'భద్ర', 'తులసి' వంటి హిట్స్ అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రను పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. అలాగే బాలకృష్ణ చిత్రానికి చక్రి సంగీత దర్శకుడిగా పనిచేస్తుండం కూడా ఇదే ప్రథమమని అన్నారు. పాటల రికార్డింగ్ కూడా పూర్తయినట్టు చెప్పారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు. బాలకృష్ణ సరసన నమిత, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. ఈ చిత్రానికి ఆర్ద్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ, ఏ.ఎస్.ప్రకాష్ కళాదర్శకత్వం, స్టన్ శివ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|