'నిషేధం' తగదు: నమిత
సినిమా ఫంక్షన్లను హాజరు కాని నటీనటులపై చర్యలు తీసుకోంటామని తమిళ నిర్మాతల మండలి హెచ్చరిక నేపథ్యంలో నమిత, నయనతార, మీరాజాస్మిన్ లు నడిగర సంఘానికి వివరణ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు సినీ ఫంక్షన్లకు గై ర్హాజర్ అవుతుండటం నిర్మాతల మండలికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ మధ్యనే జరిగిన 'ఆదవన్' ఆడియో ఫంక్షన్ కు నయనతార, 'అళగాన్ పొన్నుదాన్' ఫంక్షన్ కు ఆ చిత్ర కథానాయిక నమిత, 'ఆదినారాయణ' ఫంక్షన్ కు మీరాజాస్మిన్ గైర్హాజర్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే హీరోయిన్లు గైర్హాజర్ అవుతున్నారని భావించిన నిర్మాతల మండలి కార్యదర్శి శివశక్తి పాండియన్ ఇటీవల తీవ్ర హెచ్చరికలు చేశారు. నడిగర సంఘంతో కూడా సంప్రదింపులు జరిపి సదరు నటీమణులపై 'రెడ్ కార్డ్స్' జారీ చేస్తామనీ, ఆ తర్వాత క్రమంలో 'నిషేధం' విధిస్తామనీ ప్రకటించారు. 'రెడ్ కార్డ్' హెచ్చరికలపై నమిత, నయన, మీరాలు వెంటనే స్పందించి ఆర్టిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న నడిగర సంఘానికి వివరణ ఇచ్చినట్టు సమాచారం.
ఆడియె ఫంక్షన్ జరుపుతున్నట్టు నిర్మాతలు తమకు ముందుగా తెలియజేయడం కానీ, టిక్కెట్ ఫేర్ ఇవ్వడం కానీ చేయలేదనీ, అందువల్లే తమకు ఫంక్షన్ విషయం తెలియలేదనీ ఈ ముగ్గురు నటీమణులు నడిగర సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ కు వివరణ ఇచ్చినట్టు చెన్నైవర్గాల భోగట్టా. శరత్ కుమార్ సైతం ఆ విషయాన్ని నిర్మాతల మండలితో చర్చించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని భరోసా ఇవ్వడంతో నమిత అండ్ కో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారట.
Be first to comment on this News / Article!
|