వైఎస్ కోసం పవన్ సైతం...
ముఖ్యమంత్రి ఆచూకి తెలయలేదనే వార్త బుధవారం ఉదయం బయటకు వచ్చినప్పటి నుంచి చిత్ర పరిశ్రమలో ఆందోళన నెలకొంది. దీంతో ముందుగానే ప్రకటించిన పలు కార్యక్రమాలు, సినిమాలు-ట్రైలర్ల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. హీరో పవన్ కల్యాణ్ సైతం తన పుట్టినరోజు వేడుకను రద్దు చేసుకున్నారు. బుధవారం పవన్ పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మిస్తున్న 'కొమురం పులి' షూటింగ్ కోసం థాయ్ లాండ్ లో ఉన్నారు. వై.ఎస్. జాడ తెలియలేదనే వార్త ఫ్లాష్ లా ఆయనకు చేరడంతో వెంటనే తన పుట్టినరోజు వేడుకను రద్దు చేసుకున్నారు. వై.ఎస్. సురక్షితంగా తిరిగి రావాలని ప్రగాఢంగా కోరుకున్న పవన్ ఆయన ఆచూకీ కోసం ఎప్పటికప్పుడు థాయ్ లాండ్ నుంచే తన మిత్రులు, సన్నిహితులను సంప్రదిస్తూ వచ్చారు.
వైఎస్ ఆచూకీ తెలియలేదనే వార్త రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను విషాదంలో ముంచెత్తడంలో బుధవారంనాడు జరుగవలసిన 'మహాత్మ' చిత్రం ట్రయిలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ, హీరో శ్రీకాంత్ రద్దు చేశారు. 3వ తేదీ గురువారం విడుదలకు సిద్ధమైన నాగచైతన్య 'జోష్' చిత్రాన్ని చిత్ర నిర్మాత దిల్ రాజు వాయిదా వేశారు. రిలీజ్ తేదీని మళ్లీ తెలియజేస్తామని చెప్పారు. గురువారం ఉదయం
'ముఖ్యమంత్రి ఇక లేరు' అంటూ ఫ్లాష్ న్యూస్ బయటకు రావడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలు షూటింగ్ లు కూడా రద్దయ్యాయి.
Be first to comment on this News / Article!
|