శ్రియ క్షేమంగానే ఉంది...
కాదేది సంచలనానికి అనర్హం అనే రీతిలో హీరోయిన్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారంటూ కొందరు అడపాదడపా వదంతులు సృష్టిస్తుంటారు. ఆమధ్య రంభ, కొద్దిరోజుల క్రితం భర్తతో విడిపోతున్న మనస్థాపంతో సోనియా అగర్వాల్ పై ఇలాంటి ఆత్మహత్యాయత్నం వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటూ ఆ వదంతులను రంభ, సోనియా కొట్టిపారేశారు. ఇటీవలే నితిన్ తో 'రెచ్చిపో' చిత్రం షూటింగ్ లో కాలికి గాయమై ముంబైలో తన కుటుంబ సభ్యుల మధ్య విశ్రాంతి తీసుకుంటున్న ఇలియానాపై సైతం ప్రేమలో విఫలమై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ వదంతులు రావడం, వాటిని స్వయంగా ఇలియానా తల్లి తోసిపుచ్చడం జరిగింది. ఇప్పుడు అందాలనటి శ్రియా శరణ్ సైతం ఇలాంటి రూమర్ మాంగర్స్ బారిన పడింది. బుధవారంనాడు ఆమె ఆత్మహత్యా యత్నానికి పాల్పడిదంటూ కొందరు పుట్టించిన ప్రచారం చెన్నై సినీ సర్కిల్స్ లో కలకలం సృష్టించింది. అంతకుముందు రోజే ఆమె 'కందస్వామి' (తెలుగులో 'మల్లన్న')ప్రెస్ మీట్ లో పాల్గొని పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానమిచ్చింది.
శ్రియపై వచ్చిన వదంతులపై నిజానిజాలను తెలుసుకునేందుకు ఆమె సన్నిహితులను సంప్రదించినప్పుడు ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తేలింది. శ్రియకు అలాంటి అవసరం లేదనీ, ప్రస్తుతం ఆమె ముంబైలో ఓ హిందీ చిత్రం షూటింగ్ లో పాల్గొంటోందనీ ఆమె సన్నిహితులు ధ్రువీకరించారు. అంతేకాకుండా సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకూ జరుగనున్న 34వ టోరెంటో అంతర్జాతీయ ఫిల్మోత్సవంలో కూడా ఆమె రెడ్ కార్పెట్ వాక్ చేయనుంది. ఆమె నటించిన ఇండో-కెనడియన్ ఫిల్మ్ 'వాట్ కుకింగ్' స్టెల్లా ఈ ఫిల్మోత్సవ్ లో ప్రదర్శితమవుతోంది.
Be first to comment on this News / Article!
|