'పుత్రుడు' సాంగ్స్ కు ఆదరణ
ఇంద్ర హీరోగా ఫ్రెండ్స్ ఫిలిం అకాడమీ పతాకంపై పాన్ అమెరికా సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'పుత్రుడు'. శ్రావణ్ కుమార్ బాపట్ల దర్శకత్వంలో ఇంద్రసేన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. సత్య సంగీతం అందించిన పాటలకు చక్కటి ఆదరణ లభిస్తున్నట్టు హీరో ఇంద్ర తెలిపారు.
మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న తన బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా ఇందులోని పాత్ర ఉంటుందనీ, రెండు కోణాలున్న వైవిధ్యమైన పాత్రను పోషించాననీ ఇంద్ర చెప్పారు. తనకు ఎంతో ఇష్టమైన గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడిన పాటలో యాక్ట్ చేయడం చాలా సంతోషం కలిగించిందన్నారు. ఇందులోని పాటలన్నీ శ్రోతలను అలరిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, 'పరశువేది' అనే పాయింట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అరుణ్, బిందు, తనీషా, జీవా, ఎంఎస్ నారాయణ, సూర్య, దువ్వాసి, రాజేందర్, కొండవలస, ఉత్తేజ, కవిత, నల్లవేణు తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం శ్రావణ్ కుమార్ సమకూర్చిన ఈ చిత్రానికి వి.ప్రభాకర్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|