'వరుడు'గా అల్లు అర్జున్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'వరుడు' అనే టైటిల్ ను ప్రకటించారు. యూనివర్శల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసక్తికరంగా ఇదే టైటిల్ ప్రిన్స్ మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రం కోసం కొద్దికాలంలో ప్రచారంలో ఉంది.
అల్లు అర్జున్-గుణశేఖర్ కాంబినేషన్ చిత్రానికి 'వరుడు' అనే పేరు సరిగ్గా సరిపోతుందనీ, అందుకే ఆ టైటిల్ ను నిశ్చయించామని డివివి దానయ్య తెలిపారు. ఈ టైటిల్ ను అడిగిన వెంటనే తమకు ఇచ్చిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అల్లు అర్జున్ కు జోడిగా ఓ కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నామనీ, అత్యద్భుత సాంకేతక విలువలతో గుణశేఖర్ ఈ చిత్రాన్ని అసాధారణ రీతిలో తెరకెక్కిస్తున్నారనీ చెప్పారు. తమిళ హీరో ఆర్య ఇందులో విలన్ గా నటిస్తున్నారని తెలిపారు. రియల్ లైఫ్ లోని 100 కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో నటిస్తుండటం విశేషమని చెప్పారు. వీరందరినీ 6 నెలలకు ముందే ఎంపిక చేసి వర్క్ షాప్ కూడా నిర్వహించినట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్, పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం గుణశేఖర్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, అశోక్ కళాదర్శకత్వం, ఆంధోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|