'ఆర్య 2' టైటిల్ ఖరారు
అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో ఆదిత్యబాబు నిర్మిస్తున్న చిత్రానికి 'ఆర్య 2' అనే టైటిల్ నే ఎట్టకేలకు ఖరారు చేశారు. అల్లు అర్జున్, సుకుమార్ కెరీర్ ను మలుపుతిప్పిన 'ఆర్య' (2004) చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. అల్లు అర్జున్ కు జోడిగా కాజల్ నటిస్తోంది. నవదీప్, శ్రద్ధాదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట్నించీ 'ఆర్య 2' అనే టైటిల్ ప్రచారంలో ఉండటంతో చివరకు అదే టైటిల్ ను కన్ ఫర్మ్ చేశారు.
మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను పోషిస్తున్నారు. తమిళ హీరో ఆర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వచ్చే వారంలో ఆడియో విడుదల చేసి దసరా కానుకగా ఈనెలాఖరులో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, జెన్నీ, తిలక్, వినోద్, జూనియర్ రేలంగి, ఎం.శ్యాంసుందర్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|