అవార్డు సంబరంలో ప్రకాష్ రాజ్
'కాంజీవరం' చిత్రంలో నటనకు గాను తనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కడం పట్ల ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. సమష్టి కృషికి దక్కిన అవార్డు ఇదనీ, ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు కూడా దక్కడం ఆనందంగా ఉందనీ పేర్కొన్నాయి.
దేశానికి స్వాతంత్ర్య రాకముందు కాంచీపురంలో చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై 'కాంజీవరం' చిత్రాన్ని దర్శకుడు ప్రియదర్శన్ ఎంతో కమిట్ మెంట్ తో తెరకెక్కించారనీ, అవార్డు కోసమని కాకుండా ఇందులో నటించిన వారంతా సినిమా పట్ల పాషన్ తో నటించారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. దర్శకుడు, రచయిత, తన సహచర నటులు పడిన తపనే తనను ఈ అవార్డుకు అర్హుని చేసిందన్నారు. తానెప్పుడూ ముందుగా రిహార్సల్స్ చేసుకోవడానికి ఇష్టపడననీ, దర్శకులు చెప్పినట్టు ఆ పాత్రకు న్యాయం చేయాలనే తపనతో పనిచేస్తుంటాననీ అన్నారు. జాతీయ అవార్డులను తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలు దక్కించుకున్నప్పటికీ తెలుగు సినిమాకి ఒక్క అవార్డు కూడా రాకపోవడానికి ఆయన దృష్టికి తీసుకవచ్చినప్పుడు, తప్పనిసరిగా వస్తాయనీ, గతంలో కృష్ణవంశీ 'అంతఃపురం' సినిమా చేశారనీ, ముగ్గురు నలుగురు దర్శకులు ఆ దిశగా దృష్టి సారిస్తే తప్పనిసరిగా తెలుగు సినిమా అన్ని కేటగిరిల్లోనూ అవార్డులు దక్కించుకుంటుందన్నారు.
Be first to comment on this News / Article!
|