'రాజు-మహరాజు' విజేతలు
మోహన్ బాబు, శర్వానంద్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా దుర్గా శంకర్ నాథ్ దర్శకత్వంలో కుమారస్వామి నిర్మించిన చిత్రం 'రాజు మహారాజు'. ఇటీవల ఈ చిత్రం విడుదలై కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం కోసం నిర్వహిం చిన లక్కీడిప్ విజేతలకు హైద్రాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో సోమవారంనాడు బహుమతుల ప్రదానం జరిగింది. శర్వానంద్, కుమార స్వామి, దుర్గా శంకర్ నాథ్, నటి ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజేతలకు శర్వానంద్ చేతుల మీదుగా బంగారు గాజుల ప్రదానం జరిగింది. వెండి కుంకుమ భరిణలు, పట్టుచీరలను దర్శకనిర్మాతలు, ఢిల్లీ రాజేశ్వరి కలిసి అందజేశారు.
Be first to comment on this News / Article!
|