చుక్కలాంటి చిన్నది..!
తరుణ్, విమలా రామన్ జంటగా సుప్రీం మూవీస్ పతాకంపై సుప్రీమ్ రాజు, గోగినేని శ్రీనివాసరావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.ఎన్.ఆదిత్య దర్శకుడు. ఇటీవలే బ్యాంకాక్ లో ఓ కీల షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది.
తొలిసారిగా చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, చుక్కలాంటి చిన్నదానికీ, చక్కనైన అబ్బాయికీ మధ్య సాగే ప్రేమ కథా చిత్రమిదని, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య తెరకెక్కిస్తున్నారనీ చెప్పారు. నేటి సాఫ్ట్ వేర్ రంగంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవన శైలి, మనోభావాలకు దగ్గరగా ఈ చిత్రం ఉటుందన్నారు. తరుణ్, విమలా రామన్ నటన ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఇటీవల బ్యాంకాక్ లో ముఖ్య సన్నివేశాలు, పాటలు చిత్రీకరించామనీ, ఈ షెడ్యూల్ తో టాకీ మొత్తం పూర్తవుతుందనీ, బ్యాలెన్స్ రెండు పాటల్నీ శ్రీలంకలో తీస్తామనీ చెప్పారు. త్వరలోనే టైటిల్ వెల్లడిస్తామని అన్నారు. ఈ చిత్రానికి గంగోత్రి విశ్వనాథ్ మాటలు, రెహ్మాన్-చిన్నిచరణ్ పాటలు, వాసు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|