'మహాత్మ' ట్రైలర్ రిలీజ్
శ్రీకాంత్ మాట్లాడుతూ, తన 100వ సినిమా కోసం కృష్ణవంశీని సంప్రదించినప్పుడు తప్పనిసరిగా చేస్తాననీ, మంచి కథ దొరికే వరకూ ఆగమనీ చెప్పారనీ, అలా 'మహాత్మ' చిత్రం రూపుదిద్దుకుందనీ చెప్పారు. తన తొలి సినిమాకి రచన చేసిన పరుచూరి సోదరులు మళ్లీ ఈ సినిమాకి పనిచేయడం, మంచి సబ్జెక్ట్, మహాత్మ టైటిల్ తో సినిమా రూపొందటం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు. ఈ చిత్రం నిర్మాత రాజకీయవేత్త మాత్రమే కాకుండా తనకు మంచి మిత్రుడని అన్నారు. చక్కటి క్వాలిటీ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నామని ఉన్నారు. కృష్ణవంశీ మాట్లాడుతూ, తాను ఏ సినిమా తీసినా మంచి పర్పస్ ఉండాలని కోరుకుంటాననీ, అలాగే తనకు సంతృప్తి కలిగంచే విధంగా కూడా ఉండాలనీ అన్నారు. శ్రీకాంత్ కోసం కథ అనుకుని పరుచూరి సోదరుల సపోర్ట్ తో ఈ స్క్రిప్టు రెడీ చేశాననీ, నిర్మాత చక్కటి సహకారం అందించారనీ చెప్పారు. సమష్టి కృషితో సినిమా చాలా బాగా వచ్చిందనీ, ఈనెల 19న ఆడియో, సెప్టెంబర్ 2న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|