'స్నేహానికి మరో పేరు వై.ఎస్'
రెండు వారాలక్రితం వై.ఎస్.ను, ఆయన శ్రీమతి విజయలక్ష్మిని, కెవిపి రామచంద్రారావును భోజనానికి పిలిచాననీ, అప్పుడు వైఎస్. 'మోహన్ బాబు స్నేహానికి ప్రాణమిస్తాడు. స్నేహం విలువ తెలిసిన వ్యక్తి' అని శ్రీమతి విజయలక్ష్మితో అన్న మాటలు జీవితాంతం మరువలేనని మోహన్ బాబు పేర్కొన్నారు. బటన్ ఉండే పంచెలను ప్రత్యేకంగా తయారు చేయించి ఇస్తానని తాను అన్నప్పుడు ఆయన నవ్వి 'ఎందుకు అంత శ్రమ' అని అన్నారనీ, అయితే పక్కనే ఉన్న కేవీపీ ప్రోత్సహించడంతో అప్పుడు కొలతలు తీసుకుని కొత్తబట్టలు రెడీ చేయించాననీ, ఆ పంచెల్ని వై.ఎస్. సమాధి మీద కప్పాననీ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 42 మంది యూనిట్ సభ్యులతో స్విట్జర్లాండ్ లో షూటింగ్ అర్ధాంతరంగా అపి రావడంతో ఆదివరం రాత్రి అక్కడకు తిరిగి బయలు దేరి వెళ్లినట్టు ఆయన తెలియజేశారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|