వైఎస్ కు సినిమా అంకితం
హ్యాపీ మూవీ క్రియేషన్స్ పతాకంపై శేఖర్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ కడప జిల్లా వాసి టి.సుల్తాన్ నిర్మించిన చిత్రం 'అనగనగా ఒక అరణ్యం'. కౌశల్, సైరాభాను, ఏక్తా త్రివేది, రేఖ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి అంకితం ఇస్తున్నట్టు నిర్మాత సుల్తాన్ ప్రకటించారు.
వై.ఎస్. ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం యదార్థ సంఘటన అనీ, భారత శాస్త్రవేత్త ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై కీకారణ్యంలో కూలిపోవడం తమ చిత్ర కథ అనీ ఆయన తెలిపారు. టీవీ ఛానెల్స్ లో ప్రసారమైన హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు చూసి తన హృదయమెంతగానో ద్రవించిందనీ, దేశంలోని కోట్లాది మంది వై.ఎస్. అభిమానుల్లో తానూ కూడా ఒకరిననీ ఆయన అన్నారు. వైఎస్ తో తనకు గల అభిమానానికి గుర్తుగా ఈ చిత్రాన్ని ఆయనకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందిందనీ, ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చిందనీ దర్శకుడు శేఖర్ చంద్ర తెలిపారు అక్టోబర్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
Be first to comment on this News / Article!
|