'ఆప్పారావు' పాటలు 14న
అల్లరి నరేష్, కామ్న జెఠ్మలాని, మేఘన హీరోహీరోయిన్లుగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన 'బెండు అప్పారావు' ఆడియో రిలీజ్ వాయిదా పడింది. ఈనెల 9న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో ఆడియో విడుదల కావలసి ఉంది. తాజాగా ఈనెల 14న నేరుగా మార్కెట్ లోకి ఆడియో రిలీజ్ చేస్తున్నట్టు రామానాయుడు తెలిపారు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అకాలమరణంతో రాష్ట్ర ప్రజలు శోక సముద్రంలో మునిగిపాయారనీ, సంతాప దినాలు కూడా ఉన్నందున ఆడియో విడుదల చేయడం సబబు కాదనిపించి ఈనెల 14వ తేదీకి వాయిదా వేశామని ఆయన చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి పాటలను నేరుగా విడుదల చేస్తామని చెప్పారు. అల్లరి నరేష్ కు సరిపోయే కథతో ఈ చిత్రం రూపొందిందనీ, ఓ గ్రామంలో ఆర్ఎంపిగా ఉంటూ మందులకు లొంగని రోగాలను కూడా తన నవ్వుతో మాయం చేసే చలాకీ డాక్టర్ కదే ఈ చిత్రమనీ తెలిపారు. దర్శకుడు ఇవివి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల మధ్య ఉండే సరదాలు, సరసాలు, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయని అన్నారు. రెండున్నర గంటల సేపు మనసుకు అహ్లాదం కలిగించే సినిమా ఇదనీ చెప్పారు రామానాయుడు గారికి ఓ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందనీ, అందుకు తగ్గట్టే ఈ చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. కోటి సంగీత సమకూర్చిన పాటలు శ్రోతలను అలరిస్తాయనీ, గతంలో తమ కాంబినేషన్ లో వచ్చిన పలు మ్యూజికల్స్ హిట్స్ తరహాలోనే ఈ చిత్రానికి కోటి మంచి సంగీతం అందించారనీ చెప్పారు. అక్టోబర్ ప్రథమార్ధంలో సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆహుతి ప్రసాద్, ధర్మవరపు, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, కొండవలస, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించారు. వెలికొండ శ్రీనివాస్ మాటలు, వి.జయరాం సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|