'పదహారేళ్ల వయసు'లో...
ఇద్దరి జీవితాల్లో పదహారేళ్ల ప్రాయం సృష్టించిన అలజడి ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రమే 'పదహారేళ్ల వయసు'. భూషణ్, ఆర్య ఓరా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీసూర్య దర్శకుడు. డెరెక్టర్స్ మూవీ పతాకంపై కిలారి హరిప్రసాద్, యాడవల్లి నర్సింగరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందేశంతో కూడిన యూత్ ఎంటర్ టైనర్ ఇదని నిర్మాతలు తెలిపారు.
యువతకు చక్కటి సందేశాన్ని అందిస్తూ అన్ని వాణిజ్యం అంశాలు మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ, ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని వారు తెలిపారు. ఈ చిత్రం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు ముగించుకుని ప్రస్తుతం డిటిఎస్ జరుపుకొంటోందని చెప్పారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్నారు. బాషాచంద్ సినిమాటోగ్రఫీ, బద్రి ఎడిటింగ్, రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|